న్యూయార్క్ లో కాల్పుల కలకలం
By - Nellutla Kavitha |
అమెరికా న్యూయార్క్ నగరంలో బాంబులు తుపాకీ కాల్పులతో విధ్వంసం సృష్టించారు దుండగులు న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ సబ్ స్టేషన్ దగ్గర అ దుండగులు జరిపిన కాల్పుల్లో 5 గురు చనిపోయారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. గ్యాస్ మాస్క్ ధరించిన దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్టుగా భావిస్తున్నారు. ఈ సంఘటనతో అధ్యక్షుడు బైడెన్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. దాడి పై అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేశారు. న్యూయార్క్ నగరం అంతా హై అలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్ నగరంలోని మెట్రో స్టేషన్లను తో పాటుగా స్కూళ్లను కూడా మూసివేశారు.
అమెరికాలో తుపాకుల వినియోగంపై నియంత్రణ చర్యలను ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. ఉదయాన్నే రద్దీ సమయంలోనే ఈ సంఘటన జరగడంతో అమెరికా అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.