స్టాక్ మార్కెట్‌లో మిక్స్‌డ్ ఓపెనింగ్
హర్యానా, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 6:24 AM GMTహర్యానా, జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హర్యానా ట్రెండ్స్‌లో పెద్ద తిరోగమనం కనిపించింది. ప్రారంభ సమయంలో కాంగ్రెస్ మెజారిటీ వైపు కదులుతున్నట్లు కనిపించింది.. రోజు గడిచేకొద్దీ పలితాల పట్టికలు మార్పులు చోటుచేసుకుని బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. రాజకీయ రంగంలో కొనసాగుతున్న ఈ గందరగోళమే.. స్టాక్ మార్కెట్‌లో కూడా కొనసాగుతోంది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో పడిపోయిన తరువాత.. ఎన్నికల ఫలితాల రోజున మార్కెట్ కూడా పలుమార్లు రంగును మార్చుకుంది.
ఫ్లాట్ స్టార్ట్ అయిన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఆకుపచ్చ, ఎరుపు మార్కుల వైపు దైసుకెళ్లేందుకు పోటీ పడ్డాయి. అయితే, రోజు గడిచేకొద్దీ మార్కెట్ పచ్చగా మారింది. ఉదయం 11:25 గంటలకు సెన్సెక్స్ 494.63 (0.61%) పాయింట్ల లాభంతో 81,532.00 స్థాయికి చేరుకుంది. మరోవైపు నిఫ్టీ 168.25 (0.68%) పాయింట్ల జంప్‌తో 24,964.00 వద్ద ట్రేడవుతోంది.మందకోడిగా ప్రారంభమై సెన్సెక్స్ ఉదయం 9.51 గంటలకు 304.83 (0.37%) పాయింట్లు పెరిగి 81,352.40కి చేరుకుంది. మరోవైపు, నిఫ్టీ 91.25 (0.37%) పాయింట్ల లాభంతో 24,887.00 వద్ద ట్రేడయింది.
ప్రస్లుత మార్కెట్‌లో పలుమార్లు పెరుగుదల, పతనం కొనసాగుతుంది. ఆసియా మార్కెట్లలో ప్రతికూల ధోరణి తర్వాత మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఈ కారణంగా ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్ హెచ్చుతగ్గులను చూపింది.ఉదయం నిఫ్టీ, సెన్సెక్స్ మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ఇందులో నిఫ్టీ 50 ఇండెక్స్ 36 పాయింట్లు లేదా 0.15 శాతం స్వల్ప లాభంతో 24,832.20 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో సెన్సెక్స్ ఇండెక్స్ 223.44 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణతతో 80,826.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.ఇతర ఆసియా మార్కెట్లు కూడా మంగళవారం భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హాంగ్ కాంగ్ కు చెందిన హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 7.5 శాతానికి పైగా పడిపోయింది. జపాన్ నిక్కీ ఇండెక్స్ 1.21 శాతం, తైవాన్ వెయిటెడ్ ఇండెక్స్ 0.76 శాతం పడిపోయింది.