చంద్రబాబు గురించి మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబు గురించి మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Sep 2023 11:48 AM GMT
Minister Harish Rao, Telangana, Siddipet, Chandrababu,

చంద్రబాబు గురించి మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామాంచలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీ-ఫార్మసీ కళాశాలను మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో బీఫార్మసీ కాలేజ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మంత్రి హరీశ్‌రావు. 8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయమని అన్నారు. విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట అన్నారు. అన్ని రకాల చదువులతో సిద్దిపేట జిల్లా విరాజిల్లుతోందని చెప్పారు. మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇలా అన్ని రకాల విద్యలు సిద్దిపేటలో అందుబాటులో ఉన్నాయి మంత్రి హరీశ్‌రావ అన్నారు. సిద్దిపేట ఒకటే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అని హరీశ్‌రావు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు గురించి మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐటీ ఐటీ అని మాత్రమే అనేవారు అని.. కానీ సీఎం కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌తో పాటు గ్రామాల్లో వ్యవసాయం పెరిగిందని చెప్పారు. గతంతో పోలిస్తే ఐటీ ఉత్పత్తులో ఇప్పుడు తెలంగాణ నెంబర్‌ వన్ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు ఉంటే ఈరోజు తెలంగాణ 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు నిలయంగా మారిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని.. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని హరీశ్‌రావు విమర్శలు చేశారు.

దేశమంతా అభివృద్ధిలో తెలంగాణనే మోడల్ అని చెప్తుంటే తెలంగాణకే సిద్దిపేట మోడల్ గా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సిద్దిపేటలో హరీష్ రావు మెజార్టీతో ఎవరూ పోటీ కూడా పడే పరిస్థితిలో ఉండరనీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ విద్య అని చెప్పారు... దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు తామంతా కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Next Story