అమిత్ షా సమాధానం చెప్పాలి - హరీశ్ రావు
By - Nellutla Kavitha | Published on 15 May 2022 11:50 AM GMTతుక్కుగుడా సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేశారని, దేశం కోసం ధర్మం కోసం అన్ని అబద్ధాలు చెప్పాలి, అదే బీజేపీ పార్టీ నినాదమని బిజెపి, అమిత్ షా పై మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. అమిత్ షా కాదు అబద్ధాల షా, అబద్ధాలకు బాద్ షా, మిత్ షా వచ్చి జూటా మాటలు చెప్పి వెళ్లారని, తెలంగాణలో అబద్ధాలు చెల్లవని అన్నారు హరీశ్ రావు.
అమిత్ షా కు దమ్ము, దైర్యం ఉంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆరెఎస్ మద్దతు తెలిపింది వాస్తవని తమ ఎంపీలు ఓటు కూడా వేశారని అన్నారు హరీశ్. మిషన్ భగీరథ కు కేంద్రం 2500 కోట్లు ఇచ్చిందన్నారు, కానీ సొంత ఖర్చులతో పథకం అమలు చేస్తున్నామని, మంచి ఫలితాలు ఇంచిందని కేంద్రం కూడా చెప్పిందని, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం చెప్పిందన్నారు మంత్రి.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయలేదు అన్నారు కానీ 3 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులకు 2679 కోట్లతో శంకుస్థాపన చేసిన విషయం లోకల్ బిజెపి నాయకులు చెప్పలేదా అని ప్రశ్నించారు హరీశ్. లెక్కలు, ఆధారాలతో సహా అన్ని విషయాలు బట్టబయలు చేశామని బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు హరీశ్ రావు.