ఉత్తమ సేవలకు గాను పంద్రాగస్టు సందర్భంగా సీపీ అవినాశ్ మహంతికి మెడల్
సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి ఆయన చేసిన సేవలకు గానూ పతకం లభించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2024 11:23 AM GMTఉత్తమ సేవలకు గాను పంద్రాగస్టు సందర్భంగా సీపీ అవినాశ్ మహంతికి మెడల్
హైదరాబాద్: 2022 జూలై 25న ఇద్దరు చైన్ స్నాచర్లు, ఆయుధాల అక్రమ రవాణాదారులను అడ్డుకోడానికి ప్రయత్నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ వారి చేతుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.
దురదృష్టకర సంఘటనలో కత్తిపోట్లకు గురైన తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) లభించింది. చదువు యాదయ్య ఓ చోరీ కేసులో ఇషాన్ నిరంజన్, రాహుల్ లను పట్టుకున్నారు. 2022 జులై 25న వీరు చోరీకి పాల్పడుతుండగా యాదయ్య అడ్డుకున్నారు. దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసి, ఛాతీపై పలుమార్లు పొడిచారు. తనకు తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆయన వారిని పట్టుకున్నారు. ఈ గాయాలతో 17 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనకు గ్యాలంటరీ అవార్డును ప్రదానం చేయనున్నట్లు హోంశాఖ ప్రకటించింది
ప్రస్తుతం సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతి ఆయన చేసిన సేవలకు గానూ పతకం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను 11 మందికి పైగా వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రదానం చేయనున్నారు. తెలంగాణ నుంచి యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం, ఏడుగురికి మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం, 11 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతితో పాటు జమీల్ భాష (కమాండెంట్), క్రిష్ణమూర్తి (ASP), నూతలపాటి జ్ఞానసుందరి (ఇన్ స్పెక్టర్), కొమర బత్తిని రాము (SI), అబ్దుల్ రఫీక్ (SI), ఇక్రమ్ ఏబీ ఖాన్ (SI), శ్రీనివాస మిశ్రా (SI), కుంచల బాలకాశయ్య(SI), లక్ష్మయ్య (ASI), గుంటి వెంకటేశ్వర్లు (ASI) లు ప్రతిభా పురస్కారాలకు ఎంపిక అయ్యారు.