27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్‌ను గెలుచుకున్న ముంబై రంజీ జట్టుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ కోటి రూపాయలు నజరాణ ఇవ్వనుంది. శనివారం లక్నోలో జరిగిన మ్యాచ్‌లో అజింక్యా రహానే నేతృత్వంలోని రంజీ ఛాంపియన్ ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు ముంబై చివరిసారిగా 1997లో రెస్ట్ ఆఫ్ ఇండియాను ఓడించి ఈ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో బీసీసీఐ రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. ముంబై క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అభయ్ హడప్ కూడా సోమవారం సన్మాన కార్యక్రమంలో కోటి రూపాయల అదనపు ప్రైజ్ మనీని ప్రకటించారు.
భారత జట్టుకు సుదీర్ఘంగా ఆడిన అజింక్యా రహానే కెప్టెన్సీలో ముంబైకి పాత రోజులు తిరిగొచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది అతని కెప్టెన్సీలో జట్టు రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. రహానే సారథ్యంలోనే టీమిండియా ఇరానీ కప్‌ను గెలుచుకుంది. 2021లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే కెప్టెన్సీలోనే భారత్ విజయం సాధించింది. తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ తన బిడ్డను చూడటం కోసం భారత్‌కు తిరిగి రాగా అప్పుడు రహానే సారథ్యం వహించాడు.
ఇరానీ కప్‌లో సర్ఫరాజ్ ఖాన్, తనుష్ కొటియన్ లు అదరగొట్టారు. సర్ఫరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 222 పరుగులు చేశాడు. తనుష్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్సులో సెంచరీ సాధించి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో ముంబై తొలి ఇన్నింగ్స్ ఆధారంగా విజయం సాధించింది.