కొందరు వ్యక్తులు ఆహార పదార్థాలు ఉన్న డబ్బాలను డంపింగ్ వాహనంలోకి వేస్తూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఫ్రాన్స్ కు చెందిన వస్తువులను కువైట్ బ్యాన్ చేసిందని చెబుతూ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలు ఫ్రాన్స్ కు చెందిన వస్తువులను వాడకూడదంటూ కువైట్ ఓ ఉదాహరణగా నిలిచిందంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు."Kuwait Put All France Products In Garbage. (sic)" అంటూ పోస్టులు పెడుతున్నారు.


నిజ నిర్ధారణ:

ఫ్రాన్స్ కు చెందిన వస్తువులను కువైట్ అధికారులు చెత్తవాహనాల్లో వేస్తున్నారంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


న్యూస్ మీటర్ ఈ ఘటనకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Al Marsd అనే వెబ్సైట్ లో ఇదే వీడియోను పోస్టు చేశారు. ఈ ఘటన సౌదీ అరేబియా లోని అల్ ఆహ్సా మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుందని స్పష్టం చేశారు. చెడిపోయిన ఛీజ్ వస్తువులను మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఫుడ్ అండ్ డ్రగ్ జనరల్ అథారిటీ ఇక పనికి రావంటూ చెత్తలోకి వేశారు. అల్ ఆహ్సా మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Gulf News లో ఈ ఘటనపై అటువంటి కథనాలే వచ్చాయి. ఛీజ్ ను సరిగా నిల్వ ఉంచకపోవడంతో 1628 ఛీజ్ వస్తువులు చెడిపోయాయని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జనరల్ సూపర్ వైజర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్ రహ్మాన్ మొహమ్మద్ అల్ హుస్సేన్ స్పష్టం చేశారు. దీంతో ఆ వస్తువులను డస్ట్ బిన్ లో పారవేశామని చెప్పారు.సౌదీ అరేబియన్ మీడియా పోర్టల్ అయిన యాంటీ రూమర్ అథారిటీ కూడా గతంలో ఛీజ్ తింటే క్యాన్సర్ వస్తుంది అనే వదంతులలో ఎటువంటి నిజం లేదని తెలిపింది.

చెడిపోయిన ఛీజ్ బాటిల్స్ ను సౌదీ అరేబియాకు చెందిన అల్ ఆహ్సా మున్సిపాలిటీ అధికారులు డస్ట్ బిన్ లోకి వేస్తూ ఉన్న వీడియోలను కువైట్ లో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


సామ్రాట్

Next Story