ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. సోషల్ మీడియాలో యూజర్ల ఫిర్యాదు.!

మెటా యాజమాన్యంలోని ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయినట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి.

By Kalasani Durgapraveen  Published on  8 Oct 2024 6:56 AM GMT
ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. సోషల్ మీడియాలో యూజర్ల ఫిర్యాదు.!

మెటా యాజమాన్యంలోని ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయినట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. డౌన్‌డెటెక్టర్.ఇన్, వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయినట్లు ధృవీకరించింది. ఇప్పటివరకు సుమారు 500 మంది డౌన్‌డెటెక్టర్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోవడంపై ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం అక్టోబర్ 8 ఉదయం 11.15 గంటలకు ప్రారంభమైంది. 70 శాతం మంది వినియోగదారులు లాగిన్ గురించి ఫిర్యాదు చేయగా.. 16 శాతం మంది సర్వర్ లోపం అన్నారు. 14 శాతం మంది యాప్‌లో సమస్య గురించి ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌తో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వినియోగదారులు ఎక్స్ ద్వారా తెలియ‌జేశారు.

ఇదిలావుంటే.. జూన్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. వెబ్‌సైట్ అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. 6,500 మంది వినియోగదారులు దాదాపు మధ్యాహ్నం 12.02 గంటలకు భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ ను యాక్సెస్ చేయడంలో సమస్యలను నివేదించారు. 58 శాతం మంది ఫీడ్‌తో, 32 శాతం మంది యాప్‌తో, 10 శాతం మంది సర్వర్ కనెక్షన్‌తో సమస్యలను ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు చెందిన వినియోగదారులు యాప్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు.

Next Story