అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి

తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on  6 April 2024 8:31 AM IST
india, student, death,  america ,

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి

అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా మృతిచెందుతున్నారు. కొందరు ప్రమాదాల్లో చనిపోతే.. ఇంకొందరు హత్యలకు గురయ్యారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. మంచి చదువు చదవి అక్కడే పెద్ద ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది యువత విదేశాలకు వెళ్తారు. కానీ.. అలాంటి వారి కలలు మధ్యలోనే చెరిగిపోతున్నాయి. తాజాగా అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

భారతీయ విద్యార్థి మృతి చెందిన విషయాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. సత్యసాయి అనే యువకుడు క్లీవ్‌ల్యాండ్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే.. అతను మృతిచెందాడని మాత్రమే భారత కాన్సులేట్‌ ప్రకటించింది. అతని మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. విద్యార్థి మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామనీ.. మృతుడి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని వివరించింది. మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు సహాయాన్ని అందజేయనున్నట్లు భరోసా ఇచ్చింది న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్.

ఇక ఇదేకేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని భారత కాన్సులేట్ తెలిపింది. వివరాలను పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు చెప్పింది. సత్యసాయి కుటుంబ సభ్యులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక సత్య సాయి మృతితో ఒక్క ఏడాదిలోనే అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Next Story