199 కోట్ల టీకా డోసుల పంపిణీ
India reports 13615 new covid-19 infections.దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గత కొద్ది రోజులుగా రోజులవారి
By తోట వంశీ కుమార్ Published on
12 July 2022 4:47 AM GMT

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గత కొద్ది రోజులుగా రోజులవారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,21,292 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 13,615పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,36,52,944కి చేరింది. నిన్నకరోనా కారణంగా 20 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 5,25,474మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న 13,265 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,29,96,427కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.50 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 3.23 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 10.6లక్షల మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసులను పంపిణీ చేశారు.
Next Story