Hyderabad: సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్.. దీని ప్రత్యేకలు ఇవే
దేశంలోనే ఫస్ట్ టైం సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్ నగరంలో నిర్మితమైంది. దీనిని పూర్తిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా నిర్మించారు.
By అంజి Published on 1 Oct 2023 11:45 AM ISTHyderabad: సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్.. దీని ప్రత్యేకలు ఇవే
దేశంలోనే ఫస్ట్ టైం సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్ నగరంలో నిర్మితమైంది. దీనిని పూర్తిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సుమారు 23 కిలోమీటర్ల పొడవుతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని నిర్మించింది. నిర్మాణ పన్నులన్నీ పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం (అక్టోబర్ 1వ తేదీ) 6 గంటలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఈ సైకిల్ ట్రాక్‌ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 23 కిలోమీటర్ల పొడవుతో 16 మెగావాట్ల సోలార్ కరెంట్‌ని జనరేట్ చేసే హెల్త్ వేను పరిచయం చేస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.
భారత్‌లోనే ఇది మొట్టమొదటిది అని, దీని తర్వాత రెండో పొడవైన సోలార్ రూఫ్ టాప్ మార్గం దక్షిణ కొరియాలోనే ఉందని పేర్కొన్నారు. అద్భుతమైన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం కోసం కృషి చేసిన అధికారులను అభినందించారు. ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి నార్సింగి, మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కోకాపేట, వట్టినాగులపల్లి మీదుగా కొల్లూరు వరకు మొత్తం 23 కి.మీ దూరం సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. ఈ సైకిల్ ట్రాక్‌పై సుమారు 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సోలార్ పవర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా దీన్ని డిజైన్ చేసి ఏర్పాటు చేశారు. ఇది 4.5 మీటర్ల వెడల్పు, మూడు ప్రత్యేక సైకిల్ లేన్‌లను కలిగి ఉంది. ఇరువైపులా గ్రినరీ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ట్రాక్ సౌత్ కొరియన్ మోడల్‌కి మెరుగైన వెర్షన్. వర్షం నుండి రక్షణ, వెలుతురు, పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, తాగునీరు, మరుగుదోడ్లు వంటి ఇతర సౌకర్యాల వంటి మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి.
ఇందులో సీసీటీవీలతో సహా అన్ని భద్రతా చర్యలు ఉంటాయి. ఇది 24/7 తెరిచే ఉంటుంది. సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను వినోదం, ఫిట్‌నెస్, రాకపోకలు వంటి విభిన్న ప్రయోజనాలతో అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. సైకిల్ ట్రాక్ నగరం యొక్క ఐటీ హబ్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రాథమిక సైకిల్ రిపేర్ షాపులతో సహా సైక్లిస్టుల కోసం అనేక సౌకర్యాలు ఉన్నాయి. నానక్‌రామ్‌గూడ, టీఎస్‌పీఏ జంక్షన్, నార్సింగి, కొల్లూరు జంక్షన్, వట్టినాగులపల్లి వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో ఐదు సైకిల్ స్టేషన్‌లు ఉంటాయి. ఈ స్టేషన్లు మొత్తం 850 సైకిల్ పార్కింగ్ స్థలాలను అందిస్తాయి, 475 సొంత పార్కింగ్ కోసం మరియు 375 అద్దె పార్కింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన ఏజెన్సీ వివిధ వయసుల వారికి అనువైన కనీస 125 సైకిళ్లను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది.
Introducing India’s first and only 23 km long, 3 laned, 16 MW solar power generating Healthway2nd in world after South Korea (solar roof top covered)Great job @HMDA_Gov 👍 pic.twitter.com/iXifgip7rS
— KTR (@KTRBRS) October 1, 2023