రియల్ ఎస్టేట్ బూమ్.. హైదరాబాద్ రెసిడెన్షియల్ యూనిట్లకు బాగా పెరిగిన డిమాండ్

2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ముంబై తర్వాత అత్యధిక రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాలు హైదరాబాద్ లోనే జరిగాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 May 2024 2:23 PM IST
hyderabad, record, sale,  residential units,

రియల్ ఎస్టేట్ బూమ్.. హైదరాబాద్ రెసిడెన్షియల్ యూనిట్లకు బాగా పెరిగిన డిమాండ్

2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ముంబై తర్వాత అత్యధిక రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాలు హైదరాబాద్ లోనే జరిగాయి. దాదాపు 9,550 రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడవ్వడం హైదరాబాద్ లో రెసిడెన్షియల్ యూనిట్లకు మంచి డిమాండ్ ఉందని రుజువు చేస్తోంది. ఇది గత సంవత్సరం (2024 మొదటి త్రైమాసికం-2024లో)తో పోలిస్తే 15 శాతం పెరుగుదల. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా సర్వేలో ఈ విషయం తెలిసింది.

హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ధరలు 13 శాతం దాకా పెరిగాయి. ముఖ్యంగా ప్రీమియం హై-రైజ్ ప్రాపర్టీలపై దృష్టి సారించారు. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ, షేక్‌పేట్‌లలోని ప్రాపర్టీలు 15 శాతం (YoY) పెరుగుదలను చవిచూసింది. అయితే సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతంలో హిమాయత్ నగర్, సోమాజిగూడ, బేగంపేట్, అమీర్‌పేటలో ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.

అప్‌గ్రేడ్ అయిన జీవనశైలి కారణంగా ఈ విభాగంలో డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. ఈ విభాగంలో అమ్మకాలు 51 శాతం పెరిగాయి. త్రైమాసికంలో అన్ని అమ్మకాల వృద్ధికి ఇది ప్రాథమిక డ్రైవర్‌గా ఉంది. గృహ కొనుగోలుదారుల దృష్టి ప్రీమియం-ధర కేటగిరీపైకి మళ్లడంతో రూ.5-10 మిలియన్లు.. రూ.5 మిలియన్ల కంటే తక్కువ కేటగిరీల్లో విక్రయాలు వరుసగా 10 శాతం, 6 శాతం తగ్గాయి.

గృహ కొనుగోలుదారులు ఇప్పటికే సిద్ధంగా ఉన్న ప్రాపర్టీలను కొనడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న లేదా త్వరలో రెడీ అవుతున్న ప్రాపర్టీలను కొనడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గత కొన్ని త్రైమాసికాలుగా పెరిగిన డిమాండ్ పాత ఇన్వెంటరీ స్టాక్‌ను క్షీణింపజేసింది. ఇక వినియోగదారులు ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన ప్రాపర్టీలను కాస్త తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా అంచనా ప్రకారం.. మార్కెట్ ఎంతో మెరుగ్గా ఉందని అంటున్నారు. విక్రయాల ఊపు పెరుగుతూ ఉండడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

Next Story