అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ యువతి సేఫ్

కొద్ది రోజుల క్రితం అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి అదృశ్యం కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on  4 Jun 2024 7:52 PM IST
Hyderabad,  nitisha, safe, America ,

అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ యువతి సేఫ్ 

కొద్ది రోజుల క్రితం అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి అదృశ్యం కలకలం రేపింది. ఆమె సురక్షితంగా ఉండాలని అంతా కోరుకున్నారు. తాజాగా ఆమె క్షేమ సమాచారాన్ని వెల్లడించారు పోలీసులు. యువతి సేఫ్‌గా ఉందనే విషయాన్ని శాన్‌బెర్నార్డినో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారికంగా వెల్లడించింది.

శాన్‌బెర్నార్డినోలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో హైదరాబాద్‌కు చెందిన యువతి కందుల నితీషా మాస్టర్స్‌ చదువుతోంది. అయితే.. ఉన్నట్లుండి ఆమె గత నెల 28వ తేదీ నుంచి అదృశ్యం అయ్యింది. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భయపడిపోయారు. వెంటనే సోషల్‌ మీడియా ద్వారా యువతి కుటుబ సభ్యులు సాయం కోరారు. ఈ క్రమంలో స్పందించిన శాన్‌బెర్నార్డినో పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. యువతి కోసం గాలింపు మొదలు పెట్టారు. విచారణలో భాగంగా లాస్‌ ఏంజెల్స్‌లో కాలిఫోర్నియా నంబర్‌ ప్లేట్‌తో ఉన్న టయోటా కారును గత నెల 30న నడుపుతూ కనిపించిందని పలువురు చెప్పారని పోలీసులు వెల్లడించారు. ఆ దిశగా దర్యాప్తు చేసి.. వెతికామని చెప్పారు. చివరకు హైదరాబాద్‌ యువతి నితీషాను క్షేమంగా గుర్తించామని చెప్పారు.

Next Story