స్పెషల్ షోస్‌పై హైకోర్టు అసంతృప్తి.. కాంగ్రెస్‌కు హరీష్‌రావు కౌంటర్
తెలంగాణలో గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలపై హైకోర్టులో విచారణ జరిగింది
By Knakam Karthik Published on 10 Jan 2025 2:40 PM ISTTELANGANA: స్పెషల్ షోస్‌పై హైకోర్టు అసంతృప్తి.. కాంగ్రెస్‌కు హరీష్‌రావు కౌంటర్
తెలంగాణలో గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలపై హైకోర్టులో విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా స్పెషల్ షోలకు పర్మిషన్‌పై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, పరోక్షంగా స్పెషల్ షోస్‌కు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్ష చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ సెక్రటరీని న్యాయస్థానం ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని కామెంట్ చేసింది హైకోర్టు. ఈ విషయంపై తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
బెనిఫిట్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, రెండు వారాలు కూడా తిరగముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారంటూ సెటైర్ వేశారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలయ్యాయని విమర్శించారు హరీష్‌రావు. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమేనని హరీష్ రావు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని హరీష్ రావు ట్వీట్ చేశారు.
ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు.
— Harish Rao Thanneeru (@BRSHarish) January 10, 2025
టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి… pic.twitter.com/hO1Q7ELAWE