గంజాయికి బానిసైన కొడుకు - తల్లి ట్రీట్మెంట్ మామూలుగా లేదుగా

By -  Nellutla Kavitha |  Published on  4 April 2022 11:32 AM GMT
గంజాయికి బానిసైన కొడుకు - తల్లి ట్రీట్మెంట్ మామూలుగా లేదుగా

15 ఏళ్ళ వయసులోనే గంజాయికి బానిసైన కొడుకుకి గట్టి ట్రీట్మెంట్ ఇచ్చిందో తల్లి. చిన్నతనంలోనే గంజాయికి బానిసైన కొడుకు చేజేతులా భవిష్యత్తు నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. ఆరోగ్యం పాడవుతుందని బుజ్జగించింది, బెదిరించి చూసింది. అయినా పద్ధతి మార్చుకోక పోగా, డ్రగ్స్ కు మరింత ఎడిక్ట్ అయిపోయాడు ఆ బాలుడు. దీంతో బాలుడి తల్లి ఈసారి ఘాటుగా ట్రీట్మెంట్ ఇచ్చింది.

సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన 15 ఏళ్ళ కొడుక్కు అందరిముందే, ఎప్పటికీ గుర్తుండేలా బుద్ది చెప్పింది. మత్తుతో చిత్తయి పోతున్న తన కొడుకును వీధిలోకి లాక్కొచ్చి చితకొట్టింది. అంతేనా స్థంబానికి కట్టేసి కంట్లో కారం చల్లింది. గంజాయి అలవాటు మానేస్తా అన్నదాకా వదలకుండా గట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. గంజాయి దందాపై పోలీసులు దృష్టి సారించాలని వేడుకుంటోంది సదరు మహిళ. బిడ్డలో మార్పు కోసమే ఈ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చానని చెబుతోంది.

ఇప్పటికే డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరించిపోతుంది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీల వరకు ఎంతో మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్, గంజాయి కల్చర్ ఇప్పుడు పల్లెల్లోకి కూడా విస్తరించిందని పోలీసులు పల్లెల్లో గంజాయి దందాపై ఓ కన్నేయాలని ఆ తల్లి వేడుకుంటోంది.Next Story