ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని ఈ నెల 26న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. కాగా అక్కడ కొంత చికిత్స పూర్తయిన తర్వాత మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని ముంబైకి తరలించారు. ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లోనే చికిత్స అందించగా కాసేపటి క్రితం కొడాలి నానిని ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు.
కాగా సోమవారం ఉదయం ఏఐజీ హాస్పిటల్ వైద్యులు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. కొడాలి నాని గుండెలో మొత్తం మూడు వాల్స్ మూసుకుని పోవడంతో క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ అమర్చడం లేదా బైపాస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తరలించినట్లు సమాచారం.