దేశ రాజధానిలో మళ్లీ పెరిగిన కేసులు
By - Nellutla Kavitha | Published on 17 April 2022 10:05 AM ISTఢిల్లీలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ఢిల్లీలో 461 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివిటీ రేటు 5.33శాతంగా నమోదైంది. జనవరి 31 తర్వాత ఇదే అత్యధికం. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పబ్లిక్ ప్లేసుల్లో కరోనా టెస్టింగ్ సెంటర్లను ఓపెన్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు గానే మెట్రో స్టేషన్లు బస్ స్టాప్ లో మార్కెట్లలో రాండమ్ టెస్టులు చేయాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ టెస్టులు జరగనున్నాయి, ఇక మంగళవారం బులెటెన్లో టెస్టుల ఫలితాలను చూపించనుంది ప్రభుత్వం.
ఢిల్లీలో రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని, అందుకు తగ్గట్టుగా రెండు మూడు రోజుల్లో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలని భావిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఇందుకోసం రెండు మూడు రోజుల్లో ఆర్థిక, ఆరోగ్య శాఖ లు ఒక ప్లాన్ ను సిద్ధం చేయనున్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీలో లక్ష శాంపిల్స్ను పరీక్షించే కెపాసిటీ ఉంది. వీలైతే దాన్ని రెండు నుంచి మూడు లక్షలకు పెంచే దిశగా ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఆ అవసరం రాకపోవచ్చు అని, ప్రస్తుతానికైతే పరిస్థితులన్నీ కంట్రోల్ గానే ఉన్నాయని భావిస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. అక్కడ ప్రస్తుతం 59 మంది పేషెంట్లు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే అందులో 30 మందికి కోవిడ్ ఉన్నట్లుగా తేలింది. ఇక 772 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వారంతా కరోనా పాజిటివ్ పేషెంట్లు.
ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే గడచిన 24 గంటల్లో 975 కరోనా కేసులు నమోదయ్యాయి. డైలీ పాజిటివిటీ రేట్ 0.32 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 11, 366 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.