ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు

కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.

By Srikanth Gundamalla  Published on  20 May 2024 9:27 AM GMT
delhi, liquor scam case, kavitha, remand extended,

 ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో దేశంలో సంచలనంగా మారింది. ఈకేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. మే 20 తేదీతో కవిత కస్టడీ ముగియగా.. ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి ఎమ్మెల్సీ కవితకు షాక్‌ ఇచ్చింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ సంస్థలు రెండూ విచారణ జరుపుతున్నాయి. కాగా.. రెండు కేసుల్లోనూ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపుతోంది. కవిత కస్టడీ ముగియడంతో అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను కోర్టు ముందు హాజరుపర్చారు. ఇక ముందే అధికారులు కవిత కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగింది. కవితను కోర్టులో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈడీ, సీబీఐ హాజరుపర్చింది. సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. రిమాండ్‌ వచ్చే నెల 3వ తేదీ వరకు ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 26వ తేదీ నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన ఎండు కేసుల్లోనూ కవిత రిమాండ్ ముగిసింది. ఇవాళ తాజాగా కోర్టులో అదే రిమాండ్‌ను పొడిగించింది. ఇంతకుముందే కవితకు బెయిల్‌ ఇప్పించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ.. బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు పలుమార్లు నిరాకరించింది. ఇక ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.

Next Story