ఎమ్మెల్సీ కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on  12 April 2024 5:00 PM IST
delhi, liquor scam case, cbi custody,  kavitha,

ఎమ్మెల్సీ కవితకు షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పలు దఫాలుగా కస్టడీకి తీసుకుని విచారించారు. లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సహా పలువురు ఇంతకుముందే అరెస్ట్ అయ్యారు. కాగా.. తాజాగా రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంక ఏసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఐదు రోజుల పాటీ కవితను సీబీఐ కస్టడీకి ఇవ్వాలని అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. ఇక కోర్టు కవితను మూడు రోజుల పాటు అంటే ఈ నెల 14వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పర్చాలని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ స్కాంక కేసులో కవిత పాత్రపై సీబీఐ పలు కీలక విషయాలను వెల్లడించింది. కవితే రూ.100 కోట్లు చెల్లించినట్లు కస్టడీ రిపోర్టులో తెలిపింది. కవిత జాగృతి సంస్థకు శరత్‌ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించారని సీబీఐ తెలిపింది. ఇక డబ్బుల కోసం శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ పేర్కొంది.

Next Story