ఒక్కసారిగా అకౌంట్లలోకి కోట్లాది రూపాయల డబ్బు

By -  Nellutla Kavitha |  Published on  30 May 2022 10:03 AM GMT
ఒక్కసారిగా అకౌంట్లలోకి కోట్లాది రూపాయల డబ్బు

పదివేలో, లక్షో కాదు ఏకంగా ఒక్క సారిగా కోట్లలో డబ్బు మన బ్యాంకు ఖాతాలో మనకే తెలియకుండా, మనప్రమేయం లేకుండానే జమ అయితే. ఊహకందడం లేదుకదా. కానీ, అక్షరాలా ఏకంగా 18 కోట్ల యాభై రెండు లక్షలు ఖాతాలో జమ అయిన సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది.

వికారాబాద్ జిల్లా కేంద్రంలో వెంకట్ రెడ్డి వ్యక్తి ఖాతాలో ఒక్క సారిగా 18 కోట్ల 52 లక్షల రూపాయలు పడ్డాయి. వికారాబాద్ పట్టణంలో మొబైల్ షాప్ నడుపుతాడు వెంకట్ రెడ్డి. ఇతనికి అకౌంట్ ఉన్న HDFC వికారాబాద్ బ్రాంచ్ లో ఒక్క సారిగా 18 కోట్ల యాబై రెండు లక్షల రూపాయల పడడంతో ఆశ్యర్యానికి గురయ్యాడు వెంకట్రెడ్డి. వెంటనే బ్యాంకు అధికారులకు విషయం తెలియచేయడంతో వారు తన అకౌంట్‌ను ఫ్రీజ్ చేసారు. దాంతో ఇబ్బందిపడాల్సి వచ్చిందని, ఎటువంటి లావాదేవీలు తన అకౌంట్ నుంచి జరగలేదని ఆయన తెలిపారు.

ఇక చెన్నైలోని HDFC బ్యాంక్ త్యాగరాజనగర్ బ్రాంచాలో కూడా నిన్న వందమంది అకౌంట్లలో 13 కోట్ల చొప్పున డిపాజిట్ అయింది. సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని గుర్తించిన సిబ్బంది ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయడంతోనే ఇలా జరిగినట్లుగా చెపుతున్నారు.

Next Story