హైపర్ ఆది పొలిటికల్ కామెంట్స్.. ఆయన కోసమే!
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు
హైపర్ ఆది పొలిటికల్ కామెంట్స్.. ఆయన కోసమే!
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. పలు సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. హైపర్ ఆది తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని తెలిపారు. నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను అంటే జబర్దస్త్ షోనే కారణం. నాకు రోజాతో ఎలాంటి గొడవలు లేవు. జబర్దస్త్ సెట్స్‌లో రోజా ఎప్పుడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడేవారు కాదు. నాగబాబులాగే ఈమె కూడా నన్ను ప్రోత్సహించారు. తను ఇష్టపడే వ్యక్తులు వేరు, నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌ని. పవర్ స్టార్ అనుసరించే ప్రతి ఒక్క సిద్ధాంతం నాకు నచ్చుతుందన్నారు హైపర్ ఆది.
పవన్ కళ్యాణ్‌ను ఎవరెమన్నా నాకు కోపం వస్తుంది.. తప్పకుండా రియాక్ట్ అవుతానన్నారు హైపర్ ఆది. ఆయన వ్యక్తిగతంగా ఎవరినీ దూషించరు. ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడతారు. ఆయన గెలిస్తే జనాలకు తప్పకుండా మంచి చేస్తాడని అభిప్రాయ పడ్డారు. ఆయనే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.. నేను పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు సపోర్ట్ చేయడం లేదన్నారు. జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మాత్రం తప్పకుండా చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసమైన నేను గెలుస్తాను. ఈసారి కూడా జనసేన తరపున నేను క్యాంపైన్ చేయడానికి వెళతానని అన్నారు.