అమెరికా టూర్ తర్వాత సౌత్‌కొరియా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 10:43 AM ISTఅమెరికా టూర్ తర్వాత సౌత్‌కొరియా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అమెరికాలో ఏడురోజుల పాటు పర్యటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను ఆహ్వానించారు. ఎంవోయూ కూడా కుదర్చుకున్నారు. అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆయన బృందం సౌత్ కొరియాలో అడుగుపెట్టారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి షీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ మేరకు అమెరికా పర్యటన విజయవంతం అయినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన చాలా కంపెనీలు ముందుకొచ్చాయన్నారు.
19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభత్వం కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన అమెరికాలోని పలు కంపెనీలతో చర్చలు, ఎంవోయులు చేశారు. మొత్తంగా అమెరికా టూర్‌లో రాష్ట్రానికి రూ.31,532 కోట్ల పెట్టుబడులు, 30,750 ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. ప్రతిష్టాత్మాకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణకి పారిశ్రామిక వేత్తల నుంచి మద్దతు లభించిందన్నారు. అమెరికా పర్యటనపై సీఎం రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక నేటి నుంచి రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో పర్యటించనున్నారు. యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సీఏం భేటీ అవుతారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఎల్ఎస్ హోల్డింగ్స్ కంపెనీతో సమావేశంలో పాల్గొనడంతో పాటు.. హ్యుందాయ్ మోటార్స్ సీనియర్ లీడర్షిప్ తో భేటీ కానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.