జార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్తున్నారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 10:18 AM ISTజార్ఖండ్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం జార్ఖండ్ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన బేంగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో జార్ఖండ్‌కు వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుంది. రాహుల్‌గాంధీ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. సోమవారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని ఆ తర్వాత తిరిగి సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకుంటారు.
సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పీసీసీ మాజీ చీఫ్ నర్సారెడ్డి సంతాప సభ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మంత్రలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొంటారు. నర్సారెడ్డికి నివాళులు అర్పించనున్నారు. కాగా.. నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా 1972 నుంచి రెండేళ్లపాటు పని చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా నర్సారెడ్డి సేవలందించారు. అంతేకాదు.. జలగం వెంకట్రావు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నర్సారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాటంలో ఆయన పాల్గొన్నారు. 1940 నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగారు.