ముందస్తు ఎన్నికలకు పోము
By - Nellutla Kavitha | Published on 21 March 2022 12:37 PM GMT2018 లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేనందున, తాము స్టార్ట్ చేసినటువంటి పథకాలన్నీ పూర్తి చేయాల్సి ఉన్నందున ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ప్రకటించారు. ఈసారి 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని, 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 చోట్ల తామే గెలుస్తామని వచ్చిందని గట్టిగా చెప్పారు సీఎం. ఆరునూరైనా తెలంగాణ లో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని అన్నారు KCR. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని మరోసారి చెప్పారు సీఎం. పాలిటిక్స్ లో పని చేసేది ఈక్వేషన్, సిచువేషన్, ట్రెండ్ అని ఎవరు, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని, ప్రజాస్వామ్యంలో దేశం కాబట్టి ఇక్కడ కూడా కేజ్రీవాల్ ప్రచారం చేసుకోవచ్చని అన్నారు కేసీఆర్. ప్రధానిగా మోడీ విఫలమయ్యారని, దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ కాదు, భారతీయ ప్రజలకు అవసరమైనటువంటి పార్టీ రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. కొంత కాలం వేచి చూస్తే అదేంటో తెలుస్తుందని అన్నారు. ప్రశాంత్ కిషోర్ తో తన స్నేహం 7 ఏళ్లుగా ఉందని పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో తను ఎక్స్పర్ట్ అన్నారు సీఎం. కేంద్రంలో మార్పు కోసం కదిలించాల్సింది, కలవాల్సిందే ఇద్దరు ముగ్గురు సీయంలను కాదు భారతీయ ప్రజలను అని అన్నారాయన.