Hyderabad: భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఎందుకంటే..

హైదరాబాద్‌లో మొన్నటిదాకా భారీగా ఉన్న చికెన్‌ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.

By Srikanth Gundamalla
Published on : 24 Nov 2023 4:47 AM

chicken rate, fall,  hyderabad, telangana,

 Hyderabad: భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఎందుకంటే..

హైదరాబాద్‌లో మొన్నటిదాకా భారీగా ఉన్న చికెన్‌ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. సుమారు 20 రోజుల్లో చికెన్ ధరలు 22 శాతం పడిపోయాయి. చికెన్ ధరలు తగ్గడంపై కొందరిలో అనుమానాలూ ఉన్నాయి. ఈ ధరలు ఎందుకు తగ్గుతున్నాయనే ఆసక్తి పెరుగుతున్నది. అసలు ఎందుకు ఇంతలా చికెన్‌ ధరలు పడిపోతున్నాంటూ ఆరా తీస్తున్నారు. కోళ్లలో ఏదైనా సమస్య వచ్చిందా అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నవంబర్ 3న లైవ్ చికెన్ కిలో ధర రూ. 140గా ఉండగా... ఇప్పుడు ధర రూ. 126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్ లెస్ చికెన్ ధరల్లో కూడా తగ్గుదల ఇదేమాదిరి ఉంది. కార్తీక మాసం కొనసాగుతోంది. ఈ సమయంలో హిందువుల.. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే కుటుంబాలు మాసం భుజించరు. కార్తీక మాసంలో చికెన్‌తోపాటు మరే ఇతర మాంసాన్ని కూడా తినరు. కార్తీక మాసం మాసం ధరలను ప్రభావితం చేస్తోంది. అందుకే ధరలు తగ్గుతూ ఉన్నాయి.

ఇక చికెన్‌ ధరల తగ్గుదలపై ఈగల్ ఫిషరీస్‌ ప్రొప్రైటర్‌ సయ్యద్‌ ఫయీజుద్దీన్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. చికెన్‌కు డిమాండ్‌ తగ్గి.. సప్లై పెరిగిందని పేర్కొన్నారు. దాంతో.. చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. అక్టోబర్‌ 29న కార్తీక మాసం మొదలైంది. హిందూ మతానికి చెందిన చాలా మంది ఈ సమయంలో మాంసానికి దూరంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధిస్తారు. దీనికి తోడు.. లక్షలాది మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటుండటంతో వారూ మాంసాహారాలకు దూరంగా ఉంటారు. ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు.. రాబోయే రోజుల్లో చెన్‌ ధరలు మరింత తగ్గే అవకాశాలూ ఉన్నాయి. ఏది ఏమైనా మాంసం ప్రియులకు మాత్రం ఇవన్నీ కలిసొచ్చాయనే చెప్పాలి. తగ్గిన ధరలతో చికెన్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. కోళ్లకు ఎలాంటి సమస్యలు లేవని.. బర్డ్‌ ఫ్లూ వంటి భయాలేమీ పెట్టుకోవద్దని చెబుతున్నారు. కాగా.. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షలు ముగిసిన తర్వాత చికెన్ ధరలు మళ్లీ పెరుగుతాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story