అమెరికాకు వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే..

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికాకు బయల్దేరి వెళ్లారు.

By Srikanth Gundamalla  Published on  19 May 2024 5:00 AM GMT
Chandrababu,  America, health checkup,

అమెరికాకు వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే.. 

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరితో పాటుగా కలిసి హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లారు. అయితే.. వైద్య పరీక్షల కోసమే చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లారు. అప్పుడు పలు టెస్టులు చేయించుకున్న తర్వాత తిరిగి ఇండియాకు వచ్చారు. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్‌ చెకప్‌ కోసమే అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. మరో ఐదు నుంచి ఆరు రోజుల పాటు చంద్రబాబు అమెరికాలోనే ఉంటారు. మరోవైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ కూడా కొద్ది రోజుల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాకు పయనం అయ్యారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మే 13న పోలింగ్‌ జరిగింది. ఇక ఎన్నికల ఫలితాలను జూన్‌ 4వ తేదీన ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వరామంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎండ, వాన అనకుండా ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు, కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియ ముగియానే ఆరోగ్యంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story