ఉత్కంఠగా మారిన బీహార్‌ ఎన్నికల ఫలితాలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఉత్కంఠగా కొనసాగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 ఓట్ల

By సుభాష్  Published on  10 Nov 2020 8:48 AM IST
ఉత్కంఠగా మారిన బీహార్‌ ఎన్నికల ఫలితాలు: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఉత్కంఠగా కొనసాగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధిక నియోజకవర్గాలున్న తూర్పు చంపారన్‌, గయా, శివాన్‌, బేగుసరయి జిల్లాల్లో 4 చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు.

అయితే చాలా వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌, ఆర్‌జేడీతో కూడిన ప్రతిపక్షకూటమి వైపు మొగ్గు చూపడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో అధికారంలోకి రావాలంటే 122 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది.

అటు మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఏడు నెలల కిందట కమల్‌ నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గూటికి చేరిన సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. అయితే ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో మరో మూడు నియోజకవర్గాలు ఈ ఉప ఎన్నిక జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్‌కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారధ్యంలో బీజేపీకి మరో 8 సీట్లు దక్కాల్సి ఉంటుంది. 28 స్థానాల్లో అధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే అసెంబ్లీ తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. వీటిలో 27 చోట్ల ఇది వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, బీహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతంది.

బీహార్‌ - 243 స్థానాలు, మధ్యప్రదేశ్‌ -28, గుజరాత్‌ - 8,యూపి -7, మరో 15 రాష్ట్రాలలో కలిపి 15 స్థానాలున్నాయి.


Next Story