బీహార్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందా..?

బీహార్‌లో మొదటి సారిగా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవరించబోతోంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సర్కార్‌పై ఓటర్లు తమ కసిని

By సుభాష్  Published on  10 Nov 2020 1:57 PM IST
బీహార్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందా..?

బీహార్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఓట్ల లెక్కింపు అందరితో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 243 స్థానాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. బీహార్‌లో మొదటి సారిగా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవరించబోతోంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సర్కార్‌పై ఓటర్లు తమ కసిని చూపిస్తూ చాలా ప్రాంతాల్లో పట్టం కడుతున్నారు. 243 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే హాప్‌మార్క్‌ దాటుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ నేతృత్వంలో విపక్ష కూటమి, మహాఘట్‌ బంధన్‌ మొదటి లీడింగ్‌లో ఎన్డీయేకు గట్టి పోటిచ్చినా.. ఆ తర్వాత వెనుకంజ వేసింది. మధ్యాహ్నం వరకు ఎన్డీయే 127 సీట్లలో మహాఘట్‌ బంధన్‌ 106 స్థానాల్లో, లీడింగ్‌లో ఉన్నాయి.

ముఖ్యంగా బీజేపీ 74 స్థానాల్లో, జేడీ యూ 48, ఎల్‌జేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆర్జేడీ 61, కాంగ్రెస్‌ 21, లెఫ్ట్‌ పార్టీలు 13 చోట్ల ముందంజలో ఉన్నాయి. అయితే ఈ ఆధిక్యాన్ని బట్టి ఇప్పుడు నిర్ధారణకు రాలేమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 శాతం వరకు మాత్రమే ముందంజలో ఉన్నామని చెబుతోంది. నిజానికి ఇది 30 శాతంపైగా ఉండవలసిందని అభిప్రాయపడుతున్నారు. 65కుపైగా సీట్లలో ఎన్డీయే, మహాఘట్‌ బంధన్‌ మధ్య అధిక్యాన్ని పరిశీలిస్తే స్వల్ప తేడా మాత్రమే కనిపించింది.


Next Story