బెండపూడి విద్యార్థుల ఇంగ్లీషుకు ముచ్చటపడ్డ సీఎం జగన్‌

By -  Nellutla Kavitha |  Published on  19 May 2022 1:21 PM GMT
బెండపూడి విద్యార్థుల ఇంగ్లీషుకు ముచ్చటపడ్డ సీఎం జగన్‌

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యం ఇటీవల సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్‌ హైస్కూలు విద్యార్థులు విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరుస్తున్నారు. వీరు మాట్లాడే ఇంగ్లిష్‌ భాష గురించి ఈమధ్య సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కాడా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు వారిని స్వయంగా రప్పించుకుని ఆ విద్యార్థులతో ముచ్చటించారు.

బెండపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తమ ఇంగ్లీషు టీచరుతో కలిసి తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వాళ్లతో సీఎం జగన్‌ సంభాషణ అంతా ఆంగ్లంలోనే కొనసాగింది. వాళ్ల ప్రతిభను మెచ్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని సీఎం జగన్‌ ఆ విద్యార్థులను దీవించారు. ఈ సందర్భంగా మేఘన అనే స్టూడెంట్‌ తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 సీఎం జగన్‌కు ఇచ్చింది. అయితే మేఘన నుంచి కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే ఇచ్చారు సీఎం జగన్‌. ఈ దృశ్యం అక్కడున్నవాళ్లను ఆకట్టుకుంది. ఇక తాను తెలుగు మీడియం విద్యార్థి కావడంతోనే ఇంగ్లిష్‌పరంగా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆంగ్ల భాషపై పట్టుసాధించేలా బోధించానని, వారితో వచ్చిన టీచర్‌ ప్రసాద్, సీయంకు వివరించారు.

Next Story