రేపు దావోస్ కు ఏపీ సీయం వైఎస్ జగన్
By - Nellutla Kavitha |Published on : 19 May 2022 7:42 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన రేపటి నుంచి మొదలు కానుంది. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరవడానికి సీయం జగన్ ఫారిన్ టూర్ వెళుతున్నారు. ఈ సదస్సుకు హాజరుకానున్న ఏపీ ప్రతినిధి బృందానికి సీయం నేతృత్వం వహించనున్నారు.
ఈ పర్యటన కోసం ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు సీయం జగన్. రేపు ఉదయం 7.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరతారు. సాయంత్రం 6 గంటలకు ఆయన జ్యూరిచ్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జగన్ బృందం దావోస్ చేరుకోనుంది. 10 రోజుల పాటు సీయం జగన్ విదేశీ పర్యటనలోనే ఉండనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీయం జగన్ ఈనెల ౩1న అమరావతికి చేరుకోనున్నారు.
Next Story