ప్రేమతో నీ పెదనాన్న.. నారా రోహిత్‌కు సీఎం చంద్రబాబు రిప్లై

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 1:00 PM GMT
Andhra Pradesh, cm Chandrababu,  nara Rohit,

ప్రేమతో నీ పెదనాన్న.. నారా రోహిత్‌కు సీఎం చంద్రబాబు రిప్లై

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్నారు. తొలి సంతకం డీఎస్సీ మెగా నోటిఫికేషన్‌పై కూడా పెట్టారు. ఇక బుధవారం చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి శుభాకాంక్షలు చెబుతూ కుటుంబ సభ్యుడు, సినీ నటుడు నారా రోహిత్‌ లేఖ రాశారు. ఈ లేఖపై తాజాగా స్పందించిన చంద్రబాబు తిరిగి నారా లోకేశ్‌కు రిప్లై పంపారు.

ప్రియమైన నారా రోహిత్.. నీ లేఖ నా మనసుకి హత్తుకుందని చంద్రబాబు రిప్లైలో రాశారు. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు సదా నా వెంట ఉన్నాయిని చెప్పారు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడ్డానని అన్నారు. అలాగే నీకు ఎల్లప్పుడు నా శుభాశీస్సులు వెన్నంటే ఉంటాయని.. ప్రేమతో నీ పెదనాన్న అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో రిప్ల్లై ఇచ్చారు.

కాగా.. సీఎం చంద్రబాబుకి నారా లోకేశ్‌ ఇలా లేఖ రాశారు.. పెద్దనాన్న.. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని అన్నారు. ఎన్నో ఒడిదొడుకులను చూశారనీ.. వాటిని తట్టుకున్నారని పేర్కొన్నాడు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డారంటూ పేర్కొన్నారు. కానీ.. గత పదేళ్ల కాలంలో ఎంతో మధనపడ్డారని ఈ సందర్భంగా నారా రోహిత్‌ పేర్కొన్నాడు. పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని అన్నారు. కష్టం వచ్చినప్పుడల్లా వాళ్లు అందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా నిలబడ్డారని చెప్పారు. అప్పుడు తెలిసింది గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ప్రజల గుండెల్లో కదిలించలేని స్థానం అని అంటూ నారా రోహిత్ రాసుకొచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరూ చరిత్రలో ఎవరు తిరగరాయలేని విజయాన్ని అందుకున్నారని నారా రోహిత్‌ పేర్కొన్నారు. ఎక్స్‌లో పేర్కొన్న లేఖను సీఎం చంద్రబాబు తాజాగా రీట్వీట్ చేశారు.

Next Story