టీ20 వరల్డ్‌ కప్‌ వేళ.. మెన్‌ ఇన్ బ్లూకి అమితాబ్‌ స్పెషల్ మెసేజ్

టీ20 వరల్డ్‌ కప్‌కు సమయం ఆసన్నం అవుతోంది.

By Srikanth Gundamalla
Published on : 2 May 2024 12:44 PM IST

amitabh, special wishes, t20 world cup, team india,

టీ20 వరల్డ్‌ కప్‌ వేళ.. మెన్‌ ఇన్ బ్లూకి అమితాబ్‌ స్పెషల్ మెసేజ్ 

టీ20 వరల్డ్‌ కప్‌కు సమయం ఆసన్నం అవుతోంది. ఇంకో నెల రోజుల్లో ఈ పొట్టి కప్‌ సమరం ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఆయా దేశాలు తమ టీమ్‌లను కూడా ప్రకటించేశాయి. ఇటీవల బీసీసీఐ కూడా టీమిండియా స్క్వాడ్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ సందర్భంగా బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మెన్‌ ఇన్ బ్లూ కోసం స్పెషల్ మెసేజ్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

'ఇది మహాయుద్దం.. మీరంతా సిద్ధంకండి' అంటూ అమితాబ్‌ బచ్చన్‌ వీడియోను చేశారు. బిగ్‌బీ తాజగా ప్రభాస్‌ హీరోగా వస్తోన్న కల్కి 2898 ఏడీ సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే పాత్ర ద్వారా అమితాబ్‌ క్రికెటర్లలో స్ఫూర్తి నింపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్‌ ఎక్స్‌ ద్వారా రీట్వీట్ చేసింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం శంఖనాదం మోగింది అంటూ వీడియోను రూపొందించారు. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కల్కి సినిమా మ్యూజిక్‌ వినిపించింది. 'ఇది మహాయుద్ధం.. గొప్ప పోరాటం. విజయం ముందు మీరు తలవొంచొద్దు. ధైర్యంగా ఉండండి. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి. బలాన్ని చూపండి..! ప్రతి తల్లి గర్వపడేలా చేయండి. శత్రువుల కళ్లలో కళ్లు పెట్టి చూడండి. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధమవుతారు' అటూ అమితాబ్‌ బచ్చన్ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపారు.

అమితాబ్‌ వాయిస్‌ వీడియోలో వినిపిస్తున్న సమయంలో స్క్రీన్‌పై రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కనిపించారు. వీరితో పాటు దేశానికి వరల్డ్‌ కప్‌ అందించిన ఎంఎస్‌ ధోనీ, నాటి సంబరాలను కూడా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story