అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు హైదరాబాదీలు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 9:00 AM ISTఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుప్రమాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వ్చింది. శుక్రవారం వరుసగా 5 వాహనాలు ఒకదానిని మరొకటి అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి. మొత్తం నలుగురు భారతీయులు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. వీరిలోముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారే.
ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని హైదరాబాద్‌కు చెందిన ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్, ఫారూక్ షేక్, పాలచర్ల లోకేశ్ గా గుర్తించారు. మరొకరిని తమిళనాడుకు చెందిన దర్విని వాసుదేవన్‌గా చెప్పారు. కాల్‌పూలింగ్ ద్వారా నలుగురు బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే కారులో ప్రయాణం చేస్తున్నారని అధికారులు చెప్పారు. వీరి కారుకు మంటలు అంటుకున్నాయనీ.. అందుకే ప్రమాదం తర్వాత బయటకు రాలేకపోయినట్లు చెప్పారు. దాంతో.. కారులో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన వారివారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.