ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ సిబ్బందికి కూడా రక్షణ లేదా?

ఎయిరిండియా క్యాబిన్ క్రూ మెంబర్‌పై లండన్‌లోని ఆమె హోటల్ రూమ్‌లో దాడికి తెగబడ్డారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Aug 2024 10:00 AM IST

air india, cabin crew member, assaulted, hotel room,  london ,

ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ సిబ్బందికి కూడా రక్షణ లేదా? 

ఎయిరిండియా క్యాబిన్ క్రూ మెంబర్‌పై లండన్‌లోని ఆమె హోటల్ రూమ్‌లో దాడికి తెగబడ్డారు. ఆమెపై భౌతికంగా దాడి చేశారని తెలుస్తోంది. లండన్ హోటల్‌లో ఆమె ఉండగా.. అక్రమంగా చొరబడ్డారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమెకు, ఆమె సహోద్యోగులకు తక్షణ సహాయం అందించడమే కాకుండా ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.

"మా సిబ్బందిలో ఒకరిని ప్రభావితం చేసిన చట్టవిరుద్ధమైన చొరబాటు సంఘటనతో మేము తీవ్ర మనోవేదనకు గురయ్యాము. ప్రొఫెషనల్ కౌన్సెలింగ్‌తో సహా మా సహోద్యోగికి, బృందానికి మేము అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తున్నాము," విమానయాన సంస్థ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం లండన్ పోలీసులు విచారిస్తూ ఉండడంతో సిబ్బంది గోప్యతను తప్పనిసరిగా గౌరవించాలని ఎయిర్ ఇండియా అభ్యర్థించింది. ఎయిర్‌లైన్ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరిగేలా స్థానిక అధికారులతో తన సహకారాన్ని కూడా ధృవీకరించింది.

Next Story