దినకర్ గుప్తా - NIA కు కొత్త బాస్
Senior IPS Officer Dinakar Gupta Appointed As NIA Chief
By - Nellutla Kavitha | Published on 23 Jun 2022 9:52 PM ISTసీనియర్ IPS ఆఫీసర్ దినకర్ గుప్తా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్‌గా ఎంపికయ్యారు. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుప్తా పంజాబ్ కేడర్‌కు చెందినవారు. గుప్తా నియామకానికి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఈరోజు సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. 31 మార్చి 2024, అంటే ఆయన పదవీ విరమణ రోజు వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు గుప్తాను జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
గతేడాది ఆయన పంజాబ్ డీజీపీగా కొనసాగుతున్న సమయంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించింది. తర్వాత పంజాబ్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా బదిలీ చేసింది. ఏడాదికాలంగా దినకర్ గుప్తా సెంట్రల్ డిప్యుటేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం గురువారం మరో నియామకం కూడా చేపట్టింది. స్వాగత్ దాస్ అనే మరో ఐపీఎస్ అధికారిని అంతర్గత భద్రతకు సంబంధించి స్పెషల్ సెక్రటరీగా నియమించింది. స్వాగత్ దాస్ 1987 బ్యాచ్‌కు చెందిన చత్తీస్‌ఘడ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఈయన నవంబర్ 30, 2024 వరకు పదవిలో కొనసాగుతారు.