హైదరాబాద్ వాసులకు అలర్ట్ - మరో గంటలో భారీ వర్షం GHMC

GHMC Issues Alert Notice To Hyderabad Residents Over Rain

By -  Nellutla Kavitha |  Published on  14 Jun 2022 7:04 PM IST
హైదరాబాద్ వాసులకు అలర్ట్ - మరో గంటలో భారీ వర్షం GHMC

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం కురుస్తాయని అధికార ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో మరో గంటలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసి అధికారులు సూచిస్తున్నారు.

సోమవారం తెలంగాణలోని మహబూబ్నగర్ లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు, ఈ రోజు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించి నట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాల రాకతో నిన్న సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. ఇక ఈ రోజు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతోపాటుగానే, హైదరాబాద్ నగరంలో రాబోయే ఒక గంటలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి హెచ్చరికలు జారీ చేసింది.

Next Story