కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మార్పు - క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

RBI Gives Clarity On Currency Notes

By -  Nellutla Kavitha |  Published on  6 Jun 2022 2:03 PM GMT
కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో మార్పు - క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ

మన దేశ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. అయితే కొత్తగా ముద్రించబోయే నోట్లపై భారతదేశానికి చెందిన ఇద్దరు ప్రముఖులు, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మిసైల్‌ మ్యాన్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫొటోలను కూడా ముద్రించాలని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి…అంటూ వివిధ మీడియా సంస్థలు వార్తలు అందించాయి.

గాంధీ ఫొటో ఉన్న నోట్లు ఎప్పటిలాగే చలామణిలో ఉంటాయి. కాబోయే కొత్తనోట్లపై మాత్రమే ఠాగూర్‌, కలాం ఫొటోలను ముద్రిస్తారు. అనే వార్త‌లు కూడా మీడియాలో వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన, డిజైన్స్ సిద్ధం అయిపోయాయి. ఆర్బీఐ తుది నిర్ణ‌యం తీసుకోవ‌ట‌మే ఆల‌స్యమంటూ వస్తున్న క‌థ‌నాలపై క్లారిటీ వచ్చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని భారతీయ రిజర్వు బ్యాంక్ ఈ వార్తల్ని ఖండించింది.

ఆర్బీఐ, ఆర్థిక శాఖ సన్నాహాలు ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు కొన్ని మీడియా సంస్థలలో వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రణాళికలు కూడా పూర్తయినట్లు కథనాలు కూడా వచ్చాయి. అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు అని ఆర్బిఐ స్పష్టం చేసింది. ప్రస్తుత కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ ముఖచిత్రాన్ని మార్చే ఆలోచన ఏమీ లేదని ఆర్బిఐ ప్రకటించింది. ఇలాంటి ప్రతిపాదనేదీ ఏదీ లేదని, ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఈరోజు ప్రకటన విడుదల చేసింది.


Next Story