రూ. 54కే లీటరు పెట్రోలు - రాజ్ ఠాక్రే బర్త్ డే గిఫ్ట్
Raj Thackeray Birthday Gift - Petrol Gets Cheaper
By - Nellutla Kavitha | Published on 14 Jun 2022 8:49 PM ISTఇంతకాలం మండిపోతున్న ఎండలకు తోడుగా చమురు ధరలు కూడా పోటీ పడ్డాయి. అయితే ఇప్పుడు ఋతుపవనాల రాకతో కాస్త ఎండలు తగ్గినప్పటుకీ పెట్రోల్ ధరలు మాత్రం ఇంకా మండిపోతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రూ. 100కు పైగానే చేరింది. అయితే ఈ ఒక్కరోజు మాత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉన్న క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్ లో లీటరు పెట్రోల్ ను రూ. 54 కే విక్రయించారు. దీంతో వాహనదారులు ఆ పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరి కనిపించారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ సగం ధరకే వస్తుండడంతో వాహనదారులతో రద్దీ నెలకొంది.
దీనికి అసలు కారణం, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పుట్టిన రోజు కావటమే. జూన్ 14న తమ అధినేత 54 వ పుట్టిన రోజున ఏదైనా మంచిపని చేయాలని భావించిన ఆ పార్టీ ఉపాధ్యక్షులు మౌళి థోర్వే, సవితా థోర్వేలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ అభిమాన నాయకుడు 54 వ బర్త్ డే కి గుర్తుగా ఈరోజు రూ.54కే లీటరు పెట్రోల్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్రోల్ బంక్ ముందు వాహనదారులు క్యూ కట్టారు.
అయితే పార్టీ అధినేత రాజ్‌ఠాక్రే పుట్టిన మాత్రం ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా డెడ్‌సెల్స్‌కు సంబంధించి శస్త్రచికిత్స జరగబోతుండటంతో బర్త్ డే వేడుకల్లో పాల్గోనబోనని ఆయన నిన్ననే ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అయితే సర్జరీ వచ్చే వారానికి వాయిదా పడినప్పటికీ రాజ్ ఠాక్రే మాత్రం ఈరోజు ఎవరినీ కలవలేదు.