టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు
HighCourt On TRS MLAs Poaching Case
By - Nellutla Kavitha | Published on 29 Oct 2022 3:53 PM IST
TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై హైకోర్టు విచారణలో కీలక తీర్పు వెలువడింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల రిమాండ్ రిజెక్ట్ రివిజన్ పిటిషన్ పై హైకోర్టు కీలకమైన తీర్పును ఈరోజు వెలువర్చింది. ఏసీబి కోర్టు ఇచ్చిన తీర్పు కొట్టివేసిన హైకోర్టు, ముగ్గురు నిందితులను 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలని ఆదేశించింది.
నలుగురు TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇమదులో భాగంగానే సైబరాబాద్ పోలీసుల రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు సైబరాబాద్ సీపీ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫాంహౌజ్‌లో నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభపెట్టిన వ్యవహారంలో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌లను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.