అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజయ్ ప్రమాణం - మంత్రి కేటీఆర్
Telangana Min KTR Reacts In Bandi Sanjay Swearing In Yadadri
By Nellutla Kavitha Published on
29 Oct 2022 9:06 AM GMT

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర అమిత్ షా చెప్పులు మోసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదే చేతులతో యాదాద్రిలో ప్రమాణం చేశారని ఎద్దేవా చేశారు. దొంగ ఎవరో దొర ఎవరో నిన్నటి ఆడియోల్లో తేలిపోయిందన్నారు కేటీఆర్.
బండి సంజయ్ చేసే ప్రమాణాలకు విలువ ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఫాంహౌస్ డీల్ పై ఏదైనా మాట్లాడితే విచారణను ప్రభావితం చేస్తున్నామని అంటారని, చట్టం తన పని చేస్తుందని మంత్రి కేటీఆర్ మీడియాతో వివరించారు.
Next Story