మునుగోడులో ఓటర్ల డ్రామాకు బీజేపీ తెరలేపింది - టీఆర్ఎస్

BJP Is Behind Enrolling Voters In Munugode ByPoll Says TRS

By -  Nellutla Kavitha |  Published on  14 Oct 2022 12:12 PM GMT
మునుగోడులో ఓటర్ల డ్రామాకు బీజేపీ తెరలేపింది - టీఆర్ఎస్

ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ వాళ్ళ చేతిలోనే ఉంటుందని మునుగోడులో బీజేపీ నేతలు ఎన్నికలతేదీని ముందే చెప్పడంతో రుజువైందని అన్నారు టీఆర్ఎస్ నేతలు. ఉపఎన్నికలో దొంగ ఓట్లు నమోదు చేయించిందే బీజేపీ అని వాటిని అనుమతించేలా చేసింది కూడా బీజేపీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళే కోర్టులకు కూడా వెళ్ళారని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. 40 శాతం ఓట్లు తొలగించబడ్డాయి అని బీజేపీ చెప్తోందని, చేసింది కూడా మీరే కదా అని ప్రశ్నించారాయన. ప్రజా కోర్టులో బీజేపీ ఓటమి తధ్యమని తేలిపోయిందని, ఓట్లు పోయాయి కాబట్టి ఓడిపోయామని చెప్పటానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

18వేల కోట్ల రూపాయలకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయింది నిజమని, కేంద్ర బలగాలు తేవాలని చెప్తున్నారని, ఎన్ని బలగాలు తెచ్చిన నాగార్జునసాగర్,హుజుర్ నగర్ ఫలితమే మునుగోడులోను రీపీట్ అవుతుందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.

Next Story