ఆ సింబల్స్ ను తొలగించండి - ఈసీని కలిసిన టీఆర్ఎస్
TRS Party Leaders Meet EC Over Free Symbols In Munugode ByPoll
By - Nellutla Kavitha |
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ గుర్తు - కారును పోలిన 8 గుర్తులు ఉన్నాయని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని బుద్ధ భవన్ లో సీఈఓ వికాస్ రాజ్ ని కలిసారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్,టీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి జనరల్ సోమ భరత్ కుమార్. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే సీఎం కేసీఆర్ పై క్షుద్రపూజలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చర్యల తీసుకోవాలని కూడా వారు సీఈఓ కి ఫిర్యాదు చేసారు.
గతంలో కారును పోలిన సింబల్స్ తో స్వల్ప మెజార్టీతో తమ అభ్యర్థులు ఓడిపోయారని, అందుకే అలాంటి 8 గుర్తులను తొలగించాలని కోరామని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి పిచ్చి లేసిందని, సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన తన పద్ధతి మార్చుకునేలా లేడు కాబట్టే సీఈఓ ను కలిసి పిర్యాదు చేశామని అన్నారు వినయ భాస్కర్.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మెదడుకు నోటికి కనెక్షన్ పూర్తి తొలిగిపోయినందుకే, ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు, ఆయనకు పిచ్చి లేసి వాగితే వాళ్ళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఏమైందని ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్ ప్రశ్నించారు. అమెకూడా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని, బిజెపి పార్టీ అధ్యక్షుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ నే ఆమె చదవడం మూర్ఖత్వంమని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు.