కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి - ఈసీని కలిసిన గులాబీ నేతలు

TRS Asks EC To Disqualify Komatireddy Rajgopal Reddy From Munugode ByPoll

By -  Nellutla Kavitha |  Published on  9 Oct 2022 12:24 PM GMT
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి - ఈసీని కలిసిన గులాబీ నేతలు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో కలిసి మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చింది టీఆరెఎస్ బృందం. 18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బిజెపిలో చేరానని ఓ న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని, రాజగోపాల్ రెడ్డి ని డిస్ క్వాలిఫై చేయాలని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీలు శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎన్నికల ప్రధాన అధికారి కి రిప్రజెంటేషన్ ఇచ్చారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బిజెపి పార్టీ నుండి 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టివి చానల్ లో స్వయంగా చెప్పారని, ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ గాలికి వదిలేశారని, క్విడ్ ప్రో కో కింద ఇలాంటి పనులు చేసారని ఎన్నికల ప్రధాన అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామని అన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. కాంట్రాక్ట్ లో వచ్చిన డబ్బులతో మునుగొడులో ప్రజాస్వమ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా ఆన్ క్వాలిఫై చేయాలని ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్పారు లింగయ్య యాదవ్.

రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరడానికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చరని స్వయంగా చెప్పాడని, రాజగోపాల్ రెడ్డి ని అనర్హుడి గా ప్రకటించాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామని ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, అపహాస్యం చేస్తున్నాడని, ఇలాంటి వారిని ప్రోత్సాహించద్దు అని ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామని, ఇందులో ఈటెల రాజేందర్ కి, వివేక్ కి కూడా వాటా ఇస్తామని చెప్పాడట అని కిశోర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాన్ని మోడీ, అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని, ఇలాంటివాడిని ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. ప్రజల కోసం ఏనాడు పని చేయలేదు పైసల అహంకారం ఉందని, మునుగొడులో ఎగిరెది గులాబీ జెండానేనని అన్నారు గులాబీ లీడర్లు.

Next Story