సీయం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

CBI Court Gives Permission To CM JaganMohanReddy To Fly To Paris

By -  Nellutla Kavitha |  Published on  22 Jun 2022 4:33 PM GMT
సీయం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్ష రెడ్డి పారిస్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, జూలై 2న కాన్వకేషన్ తీసుకోనున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టును కోరారు. అయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలతో కేసుల విచారణలో జాప్యం అవుతుందని సిబిఐ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అయితే సీబీఐ కోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ నెల 28 నుంచి పది రోజులపాటు సీఎం జగన్ ప్యారిస్ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే జగన్ పారిస్ పర్యటన వివరాలను సిబిఐ తోపాటుగా కోర్టుకు సమర్పించిన వెళ్లాల్సిందిగా సిబిఐ కోర్టు ఆదేశించింది.

తమ పెద్ద కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని, దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సీఎం జగన్. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ అధికారులు, జగన్ విదేశీ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వివిధ కారణాలు చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్తున్నారని, దీనివల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు సిబిఐ అధికారులు. హర్ష రెడ్డి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనడానికి ఈనెల 28 రాత్రి సీఎం జగన్ బయలుదేరుతున్నారు. ఈ విషయాన్ని సీఎంఓ వెల్లడించింది.

Next Story