వివాదంలో సాయి పల్లవి - విరాటపర్వంపై ఫిర్యాదు

Bhajarang Dal Angry On Sai Pallavi Over Her Comments

By -  Nellutla Kavitha |  Published on  16 Jun 2022 12:46 PM GMT
వివాదంలో సాయి పల్లవి - విరాటపర్వంపై ఫిర్యాదు

Uరానా, సాయి పల్లవి నటించిన తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ప్రమోషన్లలో టీం బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వాఖ్యలతో దుమారం చెలరేగింది. దీంతో హీరోయిన్ సాయి పల్లవి పై పోలీసులకు పిర్యాదు చేసింది భజరంగ్ దళ్.

ఓ ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలపై సుల్తాన్ బజార్ పోలీసులకు పిర్యాదు చేసారు భజరంగ్ దళ్ నాయకులు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా తో పాటు, గో రక్షకుల పై వివాదాస్పద వాఖ్యలు చేసారని భజరంగ్ దళ్ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. కశ్మీర్ పండిట్ల మారణకాండ, గోహత్యలకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ తాను మానవత్వాన్ని మాత్రమే చూస్తానని, అంతా ఒకటే అనే భావనతో మాట్లాడింది సాయి పల్లవి. అయితే ఈ రెండు అంశాలు ఒకటే అన్నట్లుగా కలిపి మాట్లాడడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో సీరియస్ అయింది భజరంగ్ దళ్. ఫిర్యాదు నేపథ్యంలో వీడియో పరిశీలించి, లీగల్ ఒపీనియన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాంమన్న పోలీసులు.

మరోవైపు విరాటపర్వం టైటిల్ పై కూడా అభ్యంతరం వ్యక్తం అవుతోంది. పేరును తప్పగా వాడుతున్నారని భజరంగ్ దళ్ ఆరోపిస్తోంది. మహాభారతంలోని పాండవుల అజ్ఞాతఘట్టమైన విరాటపర్వాన్ని తప్పుగా వాడారని సెన్సార్ బోర్డుకి కంప్లైట్ చేసారు భజరంగ్ దళ్ సభ్యులు. సినిమాలో హిందూ ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలుంటే తొలగించాలని, లేకుంటే సినిమా ప్రదర్శనలను అడ్డుకుంటామని సెన్సార్ బోర్డుకు లేఖ రాసారు.

Next Story