అత్యాచార ఘటనలకు పబ్స్ కారణం కాదు - సోను సూద్

Sonu Sood Responds On JubileeHills Minor Girl Case

By -  Nellutla Kavitha |  Published on  14 Jun 2022 5:52 PM IST
అత్యాచార ఘటనలకు పబ్స్ కారణం కాదు - సోను సూద్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు. ఈ ఘటనను న్యూస్ లో చూసి షాక్ అయ్యానని అన్నారు. ఇది చాలా పెద్ద క్రైం అని ఆయన అన్నారు. చేసింది మైనర్, మేజర్ కాదని, వారు ఎలాంటి క్రైం చేశారు అనేదే చూడాలని లోనూ సూద్ అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సోనుసూద్ డిమాండ్ చేశారు. నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణం అవుతున్నాయనేది చాలా తప్పని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మైనర్ అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని సోనూ సూద్ గుర్తుచేసారు. అంతా మనం ఆలోచించే పద్దతిలోఉంటుందన్నారు, పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారని అంటున్నారు, కానీ మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలే వస్తాయని ఆగ్రహించారు సోనుసూద్. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని సోనుసూద్ కోరారు.

Next Story