ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్‌ సర్వీసెస్‌ విజేతలు

Civil Services Winners Meet AP CM Jagan Mohan Reddy

By Nellutla Kavitha  Published on  13 Jun 2022 3:50 PM GMT
ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్‌ సర్వీసెస్‌ విజేతలు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌ 2021కి ఎంపికైన విజేతలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన వారితో సీఎం జగన్ ముచ్చటించారు. ఏపీ నుంచి సివిల్‌ సర్వీసులకు ఎంపికైన అభ్యర్ధులతో ముచ్చటించి, పేరుపేరునా వారిని సీఎం జగన్‌ అభినందించారు.

ఈసారి సివిల్స్‌ విజేతల్లో నంద్యాలకు చెందిన యశ్వంత్ రెడ్డికి 15వ ర్యాంకు లభించడం విశేషం. విశాఖకు చెందిన పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు, నర్సీపట్నంకు చెందిన మౌర్య భరద్వాజ్ కు 28 వ ర్యాంకు, కాకినాడ అమ్మాయి కొప్పిశెట్టి కిరణ్మయికి 56 వ ర్యాంకు, భీమవరంకు చెందిన శ్రీపూజకు 62వ ర్యాంకు, విజయవాడకు చెందిన గడ్డం సుధీర్ కుమార్ రెడ్డికి 69వ ర్యాంకు, నగరికి చెందిన మాలెంపాటి నారాయణ అమిత్ కు 70, రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ కు 99వ ర్యాంకు వచ్చాయి.

Next Story
Share it