నటి పూజా హెగ్డే కి అసౌకర్యం - దురుసుగా ప్రవర్తించిన విమాన సిబ్బంది
Puja Hegde Gets Annoyed In Indigo Flight
By - Nellutla Kavitha | Published on 9 Jun 2022 6:53 PM ISTబుట్టబొమ్మ పూజా హెగ్డే మనస్తాపానికి గురైంది. విమాన సిబ్బంది తన పట్ల దురుసుగా వ్యవహరించారని నటి పూజా హెగ్డే ఆవేదన వ్వక్తం చేసింది. ముంబయి నుండి వస్తుండగా ఇండిగో ఫ్లైట్ లో ఈ సంఘటన జరిగిందని ట్విట్టర్ లో వెల్లడించింది పూజా.
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇండిగో విమానంలో ప్రయాణిస్తుంటే అందులోని సిబ్బంది పూజాతో అసభ్యంగా ప్రవర్తించి అసౌకర్యానికి గురిచేశారని పూజా హెగ్డే తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ముంబై నుంచి బయలుదేరిన ఫ్లైట్ లో విపుల్ నకాషే అనే పేరుతో ఉన్న ఇండిగో సిబ్బంది తమతో అసభ్యంగా ప్రవర్తించినందుకు విచారంగా ఉందని, ఎటువంటి కారణం లేకుండా అహంకారం, అజ్ఞానం, బెదిరింపు టోన్ తో తమతో వ్యవహరించాడు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను. కానీ ఇది నిజంగా భయంకరమైన అనుభవం అని పోస్ట్ చేసింది.
ఇక దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. పూజాకి క్షమాపణలు చెప్తూ, తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ని, తను ప్రయాణించిన టికెట్, PNR నంబర్ ని మెసేజ్ చేయమని అడిగింది. దాంతోపాటే త్వరగా సమస్యని పరిష్కరిస్తాం అని పోస్ట్ చేసింది ఇండిగో. పూజా హెగ్డే ట్వీట్ వైరల్ కావడంతో నెటిజన్లు ఇండిగో సంస్థ, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.