పోలీస్ అధికారులకు జైలు శిక్ష వేసిన కోర్టు
TS HighCourt On Police Officers
By - Nellutla Kavitha | Published on 6 Jun 2022 3:18 PM GMTతెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీస్ అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది. జాయింట్ సీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని పోలీస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగాలు దాఖలయ్యాయి. ఈ అభియోగంపై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీస్ అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాదు నలుగురికిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదావేసింది.
Next Story