Newsmeter టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  12 Sep 2020 8:56 AM GMT
Newsmeter టాప్‌ 10 న్యూస్‌

1. ‘దుబ్బాక ఉప పోరు’కు రాజకీయ పార్టీలు సన్నద్ధం..!

తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక పోరుకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. త్వరలో ఎన్నిక జరగనుందనే సంకేతాలు వస్తుండటంతో అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గంపై పడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు మండలాల పార్టీ ఇన్‌చార్జీలుగా నిచమించారు. వీరు మండల స్థాయి ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అపహరించిన ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా

అపహరణకు గురైన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులని చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) భారత్‌కు అప్పగించింది. ఈ అప్పగింత (హ్యాండ్‌ ఓవర్‌) చైనా భూభాగంలో జరిగింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి గంట సమయం పట్టే చైనా భూభాగంలోకి ఈ ఐదుగురు సెప్టెంబర్‌ 1 పొరపాటున వెళ్లారు. వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన అధికారులు చైనా ఆర్మీతో సంప్రదింపులు జరిపారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివాహం అయిన 20 రోజులకే భర్తను చంపిన భార్య

ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టింది. అయితే.. పెళ్లైన రోజు నుంచే భర్త రోజు తాగి వచ్చి నిత్యం గొడవ పడుతుండేవాడు. దీంతో ఆమె కన్న కలలు.. కలలుగానే మిగిలాయి. రోజు రోజుకు భర్త వేదింపులు ఎక్కువ అవుతుండడంతో.. ఆవేశంలో రోకలి బండతో భర్త తలపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ ఘటన టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్.. పార్టీకి ఊపొస్తుందా?

తెలంగాణ అధికారపక్షానికి సరైన రీతిలో చెక్ పెట్టే సమర్థత.. సామర్థ్యం ఉన్నట్లుగా కాంగ్రెస్ నేతలు తమ గురించి తాము చాలా గొప్పగా చెబుతుంటారు. వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ ఇచ్చింది తామేనని.. తమను తెలంగాణ ప్రజలు ఆదరించటమే కాదు.. నెత్తిన పెట్టుకుంటారన్న అంచనాలు చూస్తేనే.. వారి మీద వారికి ఎంతటి నమ్మకమో ఇట్టే అర్థమవుతుంది. పేరు ప్రఖ్యాతులకు ఏ మాత్రం కొదవ లేని నేతలు పలువురు పార్టీలో ఉన్నా.. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిందే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్‌ కన్నుమూత

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేశ నలుమూలలా జరిగిన అన్ని రకాల ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన స్వామి అగ్నివేశ్‌.. వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై ప్రత్యేకంగా పోరాటం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి అనేక సభల్లో ప్రసంగించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. ఆదివారం నాటికి కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళఖాతాంలో అల్పడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు బలపడుతాయని వెల్లడించింది. అదే విధంగా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌లో కరోనా రికార్డులు..

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 97,570 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,59,985కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 36,24,196 మంది కోలుకోగా.. 9,58,316 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మతాల మధ్య చిచ్చు పెడతారా ? ప్రతిపక్షాలను నిలదీసిన ఎపిక్ ఫోరం

అంతర్వేది ఘటన విషయంలో ప్రతిపక్షాల వైఖరిపై ఏపి ఇంటలెక్చువల్ అండ్ సిటిజన్ ఫోరం (ఎపిక్ ఫోరం) మండిపడింది. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం రథం దగ్దం అయిన ఘటనను ఘటనగా చూడకుండా మతపరమైన రంగు పులమటం ఏమిటంటూ టిడిపి+బిజెపి+జనసేనలను నిలదీసింది. జరిగిన ఘటనను ఎవరు సమర్ధించటం లేదని, ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ఫోరం డిమాండ్ చేసింది. అయిదే ఇదే సమయంలో ఘటనకు మతంరంగును పులిమేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించటం మంచిది కాదంటూ హితవు పలికింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Fact Check : ముస్లిం పెళ్ళికి వెళ్లిన ఆర్.ఎస్.ఎస్. నేతను ఇష్టమొచ్చినట్లు కొట్టారా..?

ముస్లిం పెళ్ళికి వెళ్లిన ఆర్.ఎస్.ఎస్. నేతను ఇష్టమొచ్చినట్లు కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి పేరు చంద్రబోస్ అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. కేరళలో ఇంకా ఎన్ని రోజులు ఈ విధ్వంసకాండ కొనసాగుతుంది. కేరళలో ఎన్ని ఘోరాలు జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గానే ఉంటుందా..? ఇవి ప్రతి రోజూ జరుగుతున్న ఘటనలు అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. చంద్రబోస్ కు న్యాయం జరగాలి అంటూ ఫోటోను ట్వీట్ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సారా పేర్లు చెప్పిన రియా..!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సుశాంత్‌కు రియా డ్రగ్స్‌ ఇచ్చింది అంటూ ఆరోపణలు రావడంతో అధికారులు ఆ దిశగా విచారణ జరిపారు. డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ).. రియాకు డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు తేలడంతో ఇటీవల రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల విచారణలో రియా పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రియా డ్రగ్స్ తీసుకునే వారి పేర్లను ఎన్‌సీబీ అదికారులకు తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story